ఆవు మూత్రం సేవించడం వల్ల నాకు కేన్సర్ నయమైంది: సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్

  • ఆవు మూత్రం అమృతం
  • ఆవును మర్దన చేస్తే బీపీ కంట్రోల్ లో ఉంటుంది
  • పంచగవ్యతో ఎన్నో లాభాలున్నాయి
ఆవు మూత్రం, పాల పదార్థాలను సేవించడం వల్ల తనకు రొమ్ము కేన్సర్ నయమైందని భోపాల్ బీజేపీ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తెలిపారు. ఓ జాతీయ ఛానల్ తో ఆమె మాట్లాడుతూ, ఆవు మూత్రం అమృతమని చెప్పారు. ఆవుకు సంబంధించిన పదార్థాలతో ఎన్నో ఉపయోగాలున్నాయని అన్నారు. ఆవు పేడ, పాలు, మూత్రం, నెయ్యి, పెరుగుతో తయారు చేసే పంచగవ్యతో ఎన్నో లాభాలున్నాయని చెప్పారు.

ఆవును సరైన పద్ధతిలో మర్దన చేస్తే బీపీ కూడా అదుపులో ఉంటుందని సాధ్వి ప్రజ్ఞాసింగ్ తెలిపారు. ఆవు వెనుక నుంచి మెడల వరకు మర్దన చేస్తే ఆవు సంతోషంగా ఉంటుందని, ఇదే సమయంలో మన బీపీ కంట్రోల్ లో ఉంటుందని చెప్పారు. తపస్సు చేసుకోవడానికి గోశాలకు మించిన మంచి ప్రదేశం లేదని అన్నారు. ఇలాంటి ఆవుల పట్ల కొందరు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతోందని చెప్పారు.
Go Back to Shorts
cow
urine
sadhvi pragya
bjp

More Telugu News